‘అరణ్య’ టీజర్ లో అదరగొట్టిన రానా

13-02-2020 Thu 18:42
  • తెలుగు, తమిళం,హిందీల్లో రూపొందుతున్న చిత్రం
  • ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు
  • యాక్షన్, వినోదం ప్రధానంగా సాగే చిత్రం
Aranya movie Teaser Released

దగ్గుబాటి రానా నటించిన 'అరణ్య' చిత్రం టీజర్ విడుదలైంది. తెలుగు, తమిళం, హిందీలో రూపొందుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్, వినోదం ప్రధానంగా సాగే ఈ సినిమాను ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తుండగా, ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నటిస్తోన్న ప్రధాన తారాగణంలో తమిళ నటుడు విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియా పిలగోన్కర్ తదితరులున్నారు.

ఈ సినిమా టీజర్ లో రానా డిఫరెంట్ లుక్ తో అలరించాడు. అడవిలో ఏనుగులను మచ్చిక చేసుకుని వాటితో సహవాసం చేసే అడవి తెగకు చెందిన వ్యక్తిగా ఆయన లుక్ ఉంది. మనిషి స్వార్థం కోసం అడవులను ధ్వంసం చేస్తుండడంతో అడవుల్లో నివసించే ప్రాణుల మనుగడకు ముప్పు ఏర్పడిందని.. ముఖ్యంగా ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి ఏర్పడటంపై హీరోగా రానా చేసే పోరాటమే చిత్ర కథగా తెరకెక్కింది. ఈ సినిమా హిందీలో ‘హాథీ మేరా సాథి’, తమిళంలో ‘కాదన్’గా విడుదల కానుంది.