ఏపీ శాసనమండలి వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం భద్రత కుదింపు!

13-02-2020 Thu 18:15
  • రెడ్డి సుబ్రహ్మణ్యం భద్రతను 2 ప్లస్ 2 నుంచి 1 ప్లస్ 1కు కుదింపు
  • ఎస్కార్ట్ కూడా తొలగింపు
  • మాజీ హోం మంత్రి చినరాజప్పకు ఎస్కార్ట్ తొలగింపు
Security compression to Vice chairman of Ap Legislative council Reddy subramanyam

ఏపీ శాసనమండలి వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం భద్రతను కుదించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు ఆయనకు కల్పిస్తున్న 2 ప్లస్ 2 భద్రతను 1 ప్లస్ 1కు తగ్గించారు. అంతే కాకుండా ఎస్కార్ట్ కూడా తొలగించారు. మరోపక్క, మాజీ హోం మంత్రి, టీడీపీ సీనియర్ నేత చినరాజప్పకూ ఎస్కార్ట్ ను తొలగిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.