microsoft: నెలాఖరులో ఇండియాకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల

microsoft ceo satya nadella to visit india
  • 24 నుంచి 26వ తేదీ మధ్య పర్యటిస్తారన్న మైక్రోసాఫ్ట్
  • అదే తేదీల్లో రానున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
  • ఆసక్తిగా మారిన ప్రముఖుల పర్యటనలు
మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల ఈ నెలాఖరులో ఇండియాకు వస్తున్నారు. ఫిబ్రవరి 24 నుంచి 26వ తేదీ మధ్య ఆయన పర్యటించనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సిటిజన్ షిప్ యాక్ట్ బాధాకరమని సత్య నాదెళ్ల ఇటీవల వ్యాఖ్యానించడం, ఫిబ్రవరి 24, 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో పర్యటించనుండటం నేపథ్యంలో సత్య నాదెళ్ల పర్యటన చర్చనీయాంశంగా మారింది.

ఇండియాలో మైక్రోసాఫ్ట్ వినియోగదారులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులతో సత్య నాదెళ్ల మాట్లాడుతారని, పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది. ఆయన ఏయే నగరాలకు వెళతారన్న విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఆయన ఢిల్లీ, ముంబై, బెంగళూరు సిటీల్లో పర్యటిస్తారని, కొందరు ప్రభుత్వ నేతలు, అధికారులతో సమావేశం అవుతారని మైక్రోసాఫ్ట్ వర్గాలు తెలిపాయి.
microsoft
satya nadella
microsoft ceo

More Telugu News