వికేంద్రీకృత అభివృద్ధి అంటే అలా విభజించడం కాదు: టీడీపీ ఎంపీ గల్లా

13-02-2020 Thu 17:56
  • వికేంద్రీకృత అభివృద్ధి అంటే..
  • అభివృద్ధి చెందిన నగరానికి సెక్రటేరియట్ తరలించడం కాదు
  • ప్రభుత్వంలోని మూడు శాఖలను విభజించడం కాదు
TDP MP Galla Jayadev says Decentralized development means not to division

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మరోమారు మండిపడ్డారు. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి చేయడమంటే ప్రభుత్వంలోని మూడు శాఖలను మూడు నగరాలకు విభజించడం కాదని విమర్శించారు. ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖను ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత అభివృద్ధి చెందిన నగరానికి తరలించడం వికేంద్రీకృత అభివృద్ధి కాదని అభిప్రాయపడ్డారు. వికేంద్రీకృత అభివృద్ధి అంటే జిల్లాలకు, స్థానిక సంస్థలకు అధికారాలను అప్పగించడమని అన్నారు.