AP Governor: ఏపీ శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్

AP Governor has given notification to prorogue AP Assembly and Council
  • ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ
  • రెండు బిల్లులపై ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ప్రభుత్వం
  • ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు ఉండవన్న ప్రభుత్వ వర్గాలు
ఏపీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏపీ శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ ఉత్తుర్వులు వెలువడ్డాయి. ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా, వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ప్రోరోగ్ ఉత్తర్వులతో వైసీపీ ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించినట్టయింది. బిల్లులు శాసనమండలి ముందున్న సమయంలో సభలను ప్రోరోగ్ చేయడం వల్ల ఆర్డినెన్స్ జారీకి ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ వర్గాల సమాచారం.
AP Governor
Assembly
council
prorogue
Notification

More Telugu News