ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రానున్న పూజా హెగ్డే ఫస్టులుక్

13-02-2020 Thu 17:11
  • గీతా ఆర్ట్స్ 2 నుంచి మరో ప్రేమకథా చిత్రం
  • అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు 
  • ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు
Most Eligible Bachelore Movie

అఖిల్ కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' రూపొందుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఏప్రిల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

రేపు ప్రపంచ ప్రేమికుల దినోత్సవం కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి పూజా హెగ్డే లుక్ ను విడుదల చేస్తున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ 'విభా' అంటూ ఆమె పాత్రను పరిచయం చేస్తూ, రేపు సాయంత్రం 6 గంటల 18 నిమిషాలకి ఫస్టులుక్ ను వదలనున్నారు. గోపీసుందర్ అందించిన బాణీలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. అఖిల్ - పూజా హెగ్డే కాంబినేషన్ పై అందరిలోను మంచి ఆసక్తి వుంది. ఈ సినిమాతోనైనా అఖిల్ కి హిట్ పడుతుందేమో చూడాలి.