మంగళగిరిలో మూడు శుభాకార్యాలకు హాజరైన నారా లోకేశ్

13-02-2020 Thu 16:57
  • టీడీపీ నాయకుడి ఇంట్లో, స్థానికుల ఇళ్లల్లో ఫంక్షన్లకు లోకేశ్ హాజరు
  • ఈమని గ్రామంలో స్థానికులతో మాటామంతీ
  • వరుస ట్వీట్లు చేసి ఫొటోలు పోస్ట్ చేసిన లోకేశ్
Nara Lokesh has attended three wedding ceremonies

టీడీపీ నేత నారా లోకేశ్ గుంటూరు జిల్లా మంగళగిరిలో శుభకార్యాలకు హాజరవుతూ బిజీగా ఉన్నారు. మంగళగిరిలోను, ఆ నియోజకవర్గంలోని ఈమని గ్రామంలోను మూడు శుభకార్యాలకు తాను హాజరై, వారిని ఆశీర్వదించానని వరుస ట్వీట్లలో లోకేశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈమని గ్రామంలో స్థానికులను కలిసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను లోకేశ్ జతపరిచారు.