'ఆకాశం నీ హద్దురా' నుంచి సాంగ్ ప్రోమో

13-02-2020 Thu 16:23
  • సూర్య తాజా చిత్రంగా 'సూరరై పొట్రు'
  • తెలుగు టైటిల్ గా 'ఆకాశం నీ హద్దురా'
  • కథానాయికగా అపర్ణ బాలమురళి
Akashame Nee Haddura Movie

తెలుగు .. తమిళ భాషల్లో సూర్యకి మంచి క్రేజ్ వుంది. అందువలన తమిళంతో పాటు తెలుగులోను ఆయన సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. సుధ కొంగర దర్శకత్వంలో ఆయన తాజా చిత్రంగా తమిళంలో 'సూరరై పొట్రు' రూపొందింది. తెలుగులో ఈ సినిమాకి 'ఆకాశం నీ హద్దురా' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. 'పిల్లా పులి ..' అంటూ ఈ పాట మొదలవుతోంది. 'ఎరవేశావే సంకురాతిరి సోకుల సంపదని .. నరికేశావే నా రాతిరి నిద్దరని' అంటూ సాగుతోంది. ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, కథానాయికగా అపర్ణ బాలమురళి అలరించనుంది. పైలెట్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.