నాగశౌర్య కొత్త సినిమా లాంచ్

13-02-2020 Thu 15:51
  • నాగశౌర్య నుంచి మరో విభిన్నకథా చిత్రం 
  • ఈ నెల 19 నుంచి రెగ్యులర్ షూటింగ్
  • దర్శకురాలిగా లక్ష్మీ సౌజన్య పరిచయం 
Nagashourya Movie

నాగశౌర్య కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య సరసన నాయికగా రీతూ వర్మను తీసుకున్నారు. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఈ రోజు ఉదయం ఫిల్మ్ నగర్ లోని సంస్థ కార్యాలయంలో ఈ సినిమాను లాంచ్ చేశారు.

ఈ నెల 19వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర నటీనటుల వివరాలను .. సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. ఇటీవల నాగశౌర్య హీరోగా ఆయన బ్యానర్లో వచ్చిన 'అశ్వద్ధామ' పరాజయాన్ని చవిచూసింది. దాంతో ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడాలనే తపనతో నాగశౌర్య వున్నాడు.