ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్

13-02-2020 Thu 15:31
  • కాళేశ్వరం క్షేత్రాన్ని సందర్శించిన సీఎం 
  • అనంతరం ఏరియల్ వ్యూ ద్వారా లక్ష్మీబరాజ్ వీక్షించిన కేసీఆర్
  • అంతకుముందు, గోదావరి నదికి  చీర, సారె సమర్పణ
CM KCR has offered rituals to Muktheswarswamy
కాళేశ్వరం క్షేత్రాన్ని సీఎం కేసీఆర్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు పూర్ణకుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ముక్తేశ్వర స్వామికి కేసీఆర్ అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన లక్ష్మీబరాజ్ ను సీఎం సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా లక్ష్మీ బరాజ్ ను వీక్షించారు. నీటి నిర్వహణపై అధికారులు, ఇంజనీర్లతో సమీక్షించారు. అంతకుముందు, పుష్కరఘాట్ లో గోదావరి నదికి కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. నదిలో నాణేలు వదలిన కేసీఆర్, నదీమ తల్లికి చీర, సారె సమర్పించారు.