ఎన్టీఆర్ ఏ పాత్రైనా చేయగలడు: 'ఛత్రపతి' శేఖర్

13-02-2020 Thu 15:11
  • ఎన్టీఆర్ తో 6 సినిమాల వరకూ చేశాను 
  •  ఆయనకి మంచి జ్ఞాపక శక్తి వుంది 
  • ఎన్టీఆర్ అంటే ఇష్టమన్న 'ఛత్రపతి' శేఖర్  
Chatrapathi Sekhar praises NTR

శేఖర్ మంచి నటుడు .. ఏ పాత్రలోనైనా ఒదిగిపోవడం ఆయన ప్రత్యేకత. ఒక వైపున సినిమాలు చేస్తూనే .. మరో వైపున సీరియల్స్ కూడా చేస్తూ ఆయన తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. 'ఛత్రపతి'లో చేసిన తరువాత ఆ సినిమా టైటిల్ ఆయన ఇంటిపేరుగా మారిపోయింది.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నేను ఎన్టీఆర్ తో కలిసి ఓ 6 సినిమాల వరకూ చేశాను. సెట్లో ఉన్నంతసేపు ఆయన నవ్విస్తూనే ఉంటాడు. ఎన్టీఆర్ కంటూ ఒక స్టైల్ వుంది .. ఒక ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ వుంది. ఎంత పెద్ద డైలాగ్ అయినా ఒకసారి చూసేసి చెప్పే జ్ఞాపక శక్తి వుంది. పాత్ర ఏదైనా ఆయన అందులో పూర్తిగా లీనమైపోయి చేస్తాడు. ఎన్టీఆర్ కాంబినేషన్లో చేయడమంటే నాకు ఎప్పుడూ ఇష్టమే. చిరంజీవి తరువాత నేను ఎక్కువగా ఇష్టపడే హీరో ఎన్టీఆరే" అని చెప్పుకొచ్చాడు.