నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

13-02-2020 Thu 14:41
  • చిట్యాలలో జరిగిన ఘటన
  • టీవీఎస్ మోపెడ్ ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
  • అక్కడికక్కడే ముగ్గురి మృతి
Road accident in Nalgonda district

నల్లగొండ జిల్లాలోని చిట్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న టీఎస్సార్టీసీ సూపర్ లగ్జరీ బస్సు, టీవీఎస్ మోపెడ్ ను ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద యూ టర్న్ తీసుకోబోతున్న మోపెడ్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.

చిట్యాల శివార్లలో జరిగే ఓ శుభకార్యానికి వీరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురానికి చెందిన బిక్షపతి, చెన్నారెడ్డి గూడెంకు చెందిన నరసింహ, మరో వ్యక్తి  సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని నల్లగొండ డీఎస్పీ పరిశీలించారు. బస్సు అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.