Arvind Kejriwal: కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి ఎవరినీ పిలవడం లేదు: ఆప్

No Chief Ministers Parties Invited to Arvind Kejriwals Oath Says AAP
  • రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించడం లేదు
  • ఢిల్లీ ప్రజలందరినీ స్వాగతిస్తున్నామని వెల్లడి
  • 16న రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారం
ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల లీడర్లెవరినీ ఆహ్వానించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. ఆప్ ఢిల్లీ విభాగం కన్వీనర్ గోపాల్ రాయ్ గురువారం ఈ వివరాలు వెల్లడించారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో 16వ తేదీన కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు.

కేజ్రీవాల్ నాయకత్వంపై నమ్మకం ఉంచి, ఆప్ కు ఘన విజయం అందించిన ఢిల్లీ ప్రజలందరినీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల నేతలెవరినీ కూడా ఈ కార్యక్రమానికి పిలవడం లేదని చెప్పారు. కేవలం ఢిల్లీ కేంద్రంగానే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
Arvind Kejriwal
New Delhi
kejriwal Oath
AAp

More Telugu News