పాపం .. నా అప్పు తీర్చాకే సిల్క్ స్మిత చనిపోయింది: సీనియర్ నటి కాకినాడ శ్యామల

13-02-2020 Thu 14:00
  • 'మరో చరిత్ర'లో మంచి వేషం పడింది 
  • మొదటి నుంచి ఫైనాన్స్ చేసే దానిని 
  • స్మిత నాకు చాలా వడ్డీ చెల్లించిందన్న కాకినాడ శ్యామల     
Kakinada Syamala

అలనాటి తారలలో కాకినాడ శ్యామల ఒకరు. ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించిన ఆమె, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. 'మరో చరిత్ర' సినిమాలో నాకు బాలచందర్ గారు అవకాశం ఇచ్చారు. జయవిజయకి ఇచ్చిన పాత్రకి ముందుగా నన్ను పిలిపించిన ఆయన, ఆ తరువాత కమల్ తల్లి పాత్రకి ఓకే చేశారు. అప్పటి నుంచి నటిగా నేను వెనుదిరిగి చూసుకోలేదు.

అయితే అంతకుముందు నుంచి నేను సినిమాలకి ఫైనాన్స్ చేసే దానిని. ఆరంభంలో నష్టాలు వచ్చినా, ఫైనాన్స్ చేస్తూనే వచ్చాను. అలా నా దగ్గర డబ్బు తీసుకున్నవారిలో సిల్క్ స్మిత ఒకరు. ఒకసారి నేను ఆమెతో 'స్మితా ఇప్పటికే నాకు నువ్వు చాలా వడ్డీ ఇచ్చావు .. ఇక అసలు ఇవ్వు' అని అన్నాను. అలా అడిగిన తరువాత ఆమె నాకు మొత్తం తిరిగి ఇచ్చేసింది. పాపం .. నాకు ఇవ్వవలసిందంతా ఇచ్చేసి ఆమె చనిపోయింది" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.