FASTag: 15 రోజుల పాటు ఫాస్టాగ్ ఫ్రీ.. మరో 527 హైవేలపై ఫాస్టాగ్ విధానం అమలుకు కేంద్రం నిర్ణయం

  • ఈ నెల 15 నుంచి 29 వరకు ఉచితం
  • సెక్యూరిటీ డిపాజిట్ మాత్రం కట్టాల్సిందే
  • మినిమం బ్యాలెన్స్ లోడ్ చేసుకోవాలి
FASTag free offered for 15 days

దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలపై టోల్ ట్యాక్సుల వసూలు కోసం తీసుకువచ్చిన ఫాస్టాగ్ ను 15 రోజుల పాటు ఉచితంగా అందజేయనున్నట్టు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది. దేశవ్యాప్తంగా మరో 527 హైవేలపై ఫాస్టాగ్ టోల్ వసూలు విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించింది. దీనికి సంబంధించి కేంద్ర రోడ్ ట్రాన్స్ పోర్టు, హైవేస్ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

డిజిటల్ కలెక్షన్ ప్రోత్సాహం కోసం

నేషనల్ హైవేలపై ఉన్న టోల్ ప్లాజాల్లో డిజిటల్ కలెక్షన్లను ప్రొత్సహించేందుకు 15 రోజుల పాటు ఫాస్టాగ్ ను ఫ్రీగా అందించాలని నిర్ణయించినట్టు కేంద్రం తెలిపింది. వాహనానికి సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)ని చూపించి హైవేలపై టోల్ ప్లాజాలు, రీజనల్ ట్రాన్స్ పోర్టు ఆఫీసులు, పెట్రోల్ పంపుల వంటి పాయింట్ ఆఫ్ సేల్ లొకేషన్ కు వెళ్లి ఉచితంగా ఫాస్టాగ్ ను పొందవచ్చని పేర్కొంది. మైఫాస్టాగ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని దగ్గరలో ఫాస్టాగ్ లభించే పాయింట్లు, ఇతర వివరాలను తెలుసుకోవచ్చని వెల్లడించింది.

సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సిందే..

ఫాస్టాగ్ తీసుకునే ఫీజును రద్దు చేసినా.. సెక్యూరిటీ డిపాజిట్, కచ్చితంగా ఉండాల్సిన మినిమం బ్యాలెన్స్ లను మాత్రం మార్చలేదు. అందువల్ల ఫాస్టాగ్ తీసుకునేటప్పుడు ఆ మేరకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

More Telugu News