ఫోర్జరీ షాక్ ... మంత్రి సంతకంతో మాయ చేయాలనుకుని బుక్కయ్యాడు!

13-02-2020 Thu 12:55
  • అసైన్డ్ భూమికోసం కడప జిల్లాలో రెడ్డప్ప అనే వ్యక్తి నిర్వాకం
  • లెటర్ ప్యాడ్ పై ఫోర్జరీ సంతకంతో సిఫారసు 
  • హోంమంత్రికి, డీజీపీకి ఫిర్యాదు చేసిన మంత్రి
Minister taneti vanitha sign forgered

మంత్రి చుట్టూ తిరిగితే పని జరుగుతుందో? లేదో? అని అనుకున్నాడేమో...ఏకంగా ఆమె సంతకాన్నే ఫోర్జరీ చేసేశాడో ప్రబుద్ధుడు. కడప జిల్లాలో అసైన్డ్ భూమి పొందడం కోసం రెడ్డప్ప అనే వ్యక్తి పాల్పడిన ఈ చర్య చూసి అధికారులు నోరెళ్లబెట్టారు. వివరాల్లోకి వెళితే...తనకు భూమి కేటాయించాలని కోరుతూ మంత్రి కలెక్టర్‌కు సిఫారసు చేసినట్లుగా రెడ్డప్ప లెటర్ ప్యాడ్ పై ఫోర్జరీ సంతకంతో ఓ లేఖ సృష్టించాడు. దాన్ని తీసుకువెళ్లి కలెక్టర్ కు అందించాడు. అధికారుల క్రాస్ చెకింగ్ లో అది నకిలీ అని తేలింది. విషయం మంత్రి దృష్టికి వెళ్లడంతో ఆశ్చర్యపోయిన ఆమె సదరు వ్యక్తిపై హోంమంత్రికి, డీజీపీకి ఫిర్యాదు చేశారు.