అందుకే ఏడుసార్లు జగన్ ఢిల్లీకి వెళ్లారా?.. ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు?: యనమల

13-02-2020 Thu 12:21
  • వివరాలు వెల్లడించకపోతే ఏమనుకోవాలి?
  • కేసులకు సంబంధించి వెళ్తున్నారా? 
  • ప్రధానితో ఎంత సేపు మాట్లాడారు?
  • నిధులు ఏ మేరకు తెచ్చారు?
why jagan goes delhi asks yanamala

సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటన వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు? అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఈ రోజు మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏడు సార్లు జగన్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిశారని, వివరాలు వెల్లడించకపోతే ఏమనుకోవాలి? ఆయన కేసులకు సంబంధించి వెళ్తున్నారా? అని ప్రశ్నించారు.

ప్రధానితో ఎంత సేపు మాట్లాడారు? నిధులు ఏ మేరకు తెచ్చారు? అని నిలదీశారు.  బీజేపీ నేతలే పిలిచారా? లేక జగన్‌ నేరుగా వెళ్లారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావట్లేదని యనమల అన్నారు. అప్రజాస్వామిక చర్యలతో ఆర్థిక వ్యవస్థను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావట్లేదని విమర్శించారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సరికాదని అన్నారు. భవిష్యత్తు తరాలకి అన్యాయం జరిగే విధంగా జగన్ నిర్ణయాలుంటున్నాయని విమర్శించారు. కియా సంస్థ వారు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.