మంచు హీరో నుంచి 'అహం బ్రహ్మాస్మి'

13-02-2020 Thu 09:41
  • సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసిన మంచు మనోజ్
  • దర్శకుడిగా శ్రీకాంత్ రెడ్డి 
  • మార్చి 6న ముహూర్తం
Aham Brahmasmi Movie

మంచు మనోజ్ మొదటి నుంచి కూడా విభిన్నమైన పాత్రలను చేస్తూ వచ్చాడు. అయితే ఆశించిన స్థాయిలో ఆయన విజయాలను అందుకోలేకపోయాడు. దాంతో కొంతకాలంగా ఆయన గ్యాప్ తీసుకున్నాడు. ఈ సారి 'ఎమ్ఎమ్ ఆర్ట్స్' పేరుతో సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని మరీ రంగంలోకి దిగాడు.

కొత్తగా అనిపించిన ఒక కథను ఎంపిక చేసుకుని, ఈ బ్యానర్ పై ఒక సినిమాను నిర్మించడానికి సిద్ధమయ్యాడు. తొలి సినిమాగా 'అహం బ్రహ్మాస్మి' చేస్తున్నాడు. తాజాగా టైటిల్ తో కూడిన పోస్టర్ ను వదులుతూ ఆయన ఈ విషయాన్ని ప్రకటించాడు. శ్రీకాంత్ రెడ్డిని దర్శకుడిగా తీసుకున్న ఆయన, మార్చి 6వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు ఆ రోజున తెలియనున్నాయి.