ఆస్తులు ప్రకటించిన ఒడిశా ముఖ్యమంత్రి.. రూ.64.62 కోట్లతో మంత్రివర్గంలో అత్యంత ధనవంతుడిగా నవీన్ పట్నాయక్!

13-02-2020 Thu 08:37
  • సీఎం, మంత్రుల ఆస్తుల ప్రకటన
  • తల్లిదండ్రుల నుంచి రూ. 63 కోట్ల ఆస్తులు 
  • అత్యంత  పేదమంత్రిగా తుష్కర్ కాంతి బెహరా
naveen patnaik richest in odisha ministers

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన ఆస్తులను ప్రకటించారు. గతేడాది మార్చి 31 నాటికి తన ఆస్తి రూ.64.26 కోట్లు అని ప్రకటించారు. ఈ మేరకు నిన్న సీఎంతోపాటు, రాష్ట్ర మంత్రుల ఆస్తుల వివరాలను ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. దానిని బట్టి సీఎం నవీన్ పట్నాయక్ మొత్తం ఆస్తిలో రూ. 62 కోట్లు స్థిరాస్తులు ఉన్నాయి. తల్లిదండ్రుల నుంచి రూ. 63 కోట్ల విలువైన ఆస్తులు సంక్రమించినట్టు తెలిపారు. ఇక, ఒడిశా మంత్రుల్లో క్రీడలు, ఐటీశాఖ మంత్రి తుష్కర్ కాంతి బెహరా రూ. 25 లక్షల ఆస్తితో అత్యంత పేద మంత్రిగా నిలిచారు.