సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

13-02-2020 Thu 07:18
  • హాలిడే ఎంజాయ్ చేస్తున్న ముద్దుగుమ్మ 
  • 'ఆర్ఆర్ఆర్'కి పోటీగా స్టార్ హీరో సినిమా 
  • వరుణ్ తేజ్ ప్రాజక్టుకి బ్రేక్!  
Mehrin takes break from shoots and enjoying in Srilanka

 *  అందాలతార మెహ్రీన్ ప్రస్తుతం విదేశాలలో హాలిడే ఎంజాయ్ చేస్తోంది. షూటింగుల బిజీ నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న ఈ చిన్నది ప్రస్తుతం శ్రీలంకలోని సుందర ప్రాంతాలలో విహరిస్తోంది. ఈ హాలిడే ట్రిప్ తో రీచార్జ్ అవుతానని మెహ్రీన్ అంటోంది.
*  ఎన్టీఆర్, చరణ్ లతో రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి విదితమే. ఇది భారీ అంచనాలతో విడుదలయ్యే చిత్రం కాబట్టి దీనికి ఇక పోటీ ఉండదని అంతా అనుకున్నారు. అయితే, తమిళ హీరో విజయ్ తాను సుధ కొంగర దర్శకత్వంలో చేయనున్న చిత్రాన్ని అదే సమయానికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట.
*  ఆమధ్య చిరంజీవితో 'సైరా' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సురేందర్ రెడ్డి తన తదుపరి చిత్రాన్ని వరుణ్ తేజ్ హీరోగా చేయనున్నట్టు వార్తలొచ్చాయి. అయితే, ఇప్పుడా ప్రాజక్టును పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. కారణాలు తెలియాల్సి వుంది.