‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా ఇండిగో ఎయిల్ లైన్స్ ప్రత్యేక ఆఫర్

12-02-2020 Wed 21:59
  • రూ.999కే విమాన టికెట్
  • ఈ నెల 14న ముగియనున్న బుకింగ్ గడువు
  • మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించాలని నిబంధన
Indigo Air lines Valentine day Offer special discount for domestic passengers

వాలెంటైన్స్ డే సందర్భంగా ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ తమ విమానాల్లో దేశంలోని పలు ప్రాంతాలకు  ప్రయాణించడానికి ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. రూ.999 కే టికెట్ ను అందిస్తూ.. వాలెంటైన్స్ డే ఆఫర్ ను ఇస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా ప్రయాణికులు ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.

ఈ ఆఫర్ కోసం తమ సంస్థ మొత్తం పది లక్షల సీట్లను కేటాయించిందని తెలిపింది. ఈ ఆఫర్ టికెట్లను బుక్ చేసుకున్నవారు మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో ప్రయాణించాల్సి ఉంటుందని ఇండిగో సంస్థ వెల్లడించింది.