ఈ వివాహా వేడుకలో తెలంగాణ టీడీపీ నేతలందరినీ కలుసుకున్నాను: చంద్రబాబునాయుడు

12-02-2020 Wed 20:29
  • అశ్వారావుపేట ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి చంద్రబాబు హాజరు
  • వధూవరులను ఆశీర్వదించాను
  • ఫొటోలను పోస్ట్ చేసిన చంద్రబాబు
chandrababu says I have met All the telangana tdp leaders at this wedding ceremony

తెలంగాణలోని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా శ్రీనివాసరావు కుమారుడి వివాహానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు ఓ ట్వీట్ చేశారు. ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించానని తెలిపారు. ఈ వివాహా వేడుకలో తెలంగాణ టీడీపీ నేతలందరినీ కలుసుకున్నానని ఆ పోస్ట్ లో పేర్కొన్న చంద్రబాబు, వధూవరులకు శుభాకాంక్షలు చెబుతున్న ఫొటోలను జతపరిచారు. .