ఏపీ మంత్రులపై ఎమ్మెల్సీ అశోక్ బాబు తీవ్ర వ్యాఖ్యలు

12-02-2020 Wed 20:01
  • తుళ్లూరులో రైతులకు టీడీపీ నేతల సంఘీభావం
  • ఈ ఉద్యమానికి స్ఫూర్తి రైతుల పట్టుదల, మహిళల త్యాగం
  • వైసీపీకి  ఒక్క అవకాశమిస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారు
MLC Ashok Babu slams AP ministers

ఏపీ మంత్రులపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీస మర్యాద తెలియని వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చారని, వారు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తుళ్లూరులో రైతులకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ, ఈ ఉద్యమానికి స్ఫూర్తి రైతుల పట్టుదల, మహిళల త్యాగం అని కొనియాడారు. ఈ ఉద్యమం కేవలం ఈ ఒక్క ప్రాంతానికి సంబంధించింది కాదని, యావత్తు రాష్ట్రానికి చెందినదని అన్నారు. రాజధాని అంటే యావత్తు రాష్ట్రానికి సంబంధించింది కనుక ఈ బాధ్యతను ఐదు కోట్ల మంది ప్రజల తరఫున తాము తీసుకుంటున్నామని చెప్పారు. వైసీపీకి ప్రజలు ఒక్క అవకాశమిస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.