AAP: ఆప్ శాసనసభాపక్ష నేతగా కేజ్రీవాల్.. ఈ నెల 16న సీఎంగా ప్రమాణ స్వీకారం

  • వరుసగా మూడోసారి సీఎంగా కేజ్రీవాల్
  • ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ప్రమాణస్వీకారోత్సవం
  • ఏర్పాట్లపై లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తో కేజ్రీవాల్ చర్చ
Kejriwal elected as AAP leader in The Assembly

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు మరోసారి సన్నద్ధమైంది. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కనున్నారు. ఈ నెల 16న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీలోని రామ్ లీలా మైదానం వేదిక కానుంది.

ఈ రోజు కేజ్రీవాల్ నివాసంలో సమావేశమైన ఆప్ పార్టీ ఎమ్మెల్యేలు తమ శాసన సభా పక్షనేతగా అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్నుకున్నారు. అనంతరం, కేజ్రీవాల్ రాజ్ నివాస్ కు వెళ్లి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తో భేటీ అయ్యారు. దాదాపుగా 15 నిమిషాలపాటు సాగిన ఈ భేటీలో ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన అంశాలు చర్చించారని తెలుస్తోంది.

More Telugu News