ఏపీ బడ్జెట్ సమావేశాల తర్వాత ఎప్పుడైనా విశాఖ నుంచి సీఎం పాలన ఉండొచ్చు: మంత్రి పెద్దిరెడ్డి

12-02-2020 Wed 18:10
  • రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పాలించే స్వేచ్ఛ సీఎంకు ఉంది
  • కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, కార్యాలయాల తరలింపు ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి
  • ‘మూడు రాజధానులు ’ అనేది చాలా మంచి నిర్ణయం
Minister Peddy Reddy says  After AP Budget sessions there is a chance to rule from Vizag

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ బడ్జెట్ సమావేశాల తర్వాత  ఎప్పుడైనా విశాఖపట్టణం నుంచి  పాలన ప్రారంభం కావచ్చని అన్నారు. సచివాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పాలన చేసే స్వేచ్ఛ సీఎంకు ఉందని చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, కార్యాలయాల తరలింపు ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయని అన్నారు. మూడు రాజధానుల ప్రస్తావన లేకుండా అమరావతిలోనే రాజధానిని కొనసాగించినట్టయితే తమ ప్రభుత్వంపై ఇంత స్పందన ఉండేది కాదని, జగన్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు.