Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యం.. పార్టీ ఇన్ ఛార్జ్ పీసీ చాకో రాజీనామా

  • ఢిల్లీలో కాంగ్రెస్ పతనానికి మాజీ సీఎం షీలా దీక్షిత్ కారణమంటూ వ్యాఖ్య
  •  కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఆప్ సొంతం చేసుకుంది
  • చాకో వ్యాఖ్యలను ఖండించిన మహారాష్ట్ర కాంగ్రెస్ నేత మిలింద్ దేవర
Delhi congress incharge PC Chacko Resigned

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ.. ఢిల్లీ కాంగ్రెస్ ఇన్ చార్జ్ గా  ఉన్న పీసీ చాకో తన పదవికి రాజీనామా చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఆ పార్టీ కేవలం 4.26శాతం ఓట్లను మాత్రమే దక్కించుకుంది. 2013లో ఢిల్లీలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన చేసింది.

ఈ సందర్భంగా చాకో మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో కాంగ్రెస్ పతనానికి కారణం మాజీ సీఎం షీలా దీక్షిత్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2013లో షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పతనం ప్రారంభమైందన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఆప్ సొంతం చేసుకుందన్నారు. కోల్పోయిన ఓటు బ్యాంకును కాంగ్రెస్ తిరిగి సాధించలేకపోయిందన్నారు.

కాగా, చాకో వ్యాఖ్యలతో మహారాష్ట్ర  కాంగ్రెస్ నేత మిలింద్ దేవర విభేదిస్తూ.. ఢిల్లీలో షీలా అధికారంలో ఉండగా కాంగ్రెస్ ప్రకాశించిందన్నారు. షీలా మరణానంతరం ఆమెపై వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. షీలా పార్టీకి, ఢిల్లీ ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేశారన్నారు.

More Telugu News