Pawan Kalyan: సుగాలీ ప్రీతికి న్యాయం జరగనప్పుడు ఇక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ ఎందుకు?: పవన్ కల్యాణ్

  • ఈ చట్టాలు బలహీనులకు చాలా బలంగా పని చేస్తాయి
  • ఈ విషయంలో పోలీస్ యంత్రాంగాన్ని తప్పుబట్టడం లేదు
  • రాజకీయ నాయకులను కచ్చితంగా తప్పుబడుతున్నా 
Pawan Kalyan questions Why is the judicial capital here when there is no justice for Sugali Preethi

విద్యార్థిని సుగాలీ ప్రీతి అత్యాచార ఘటనలో ఇంతవరకూ న్యాయం చేయలేకపోయిన వైసీపీ ప్రభుత్వం ఇక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయడం ఎందుకు? అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కర్నూలులో ర్యాలీ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఈ చట్టాలు బలహీనులకు చాలా బలంగా పని చేస్తాయని, బలవంతులకు మాత్రం చాలా బలహీనంగా ఇవి పనిచేస్తాయని విమర్శించారు.

 సుగాలీ ప్రీతి విషయంలో జరిగింది ఇదేనని, ఆమె సామూహిక అత్యాచారానికి గురైనట్టు పోస్ట్ మార్టమ్ నివేదిక చెబుతున్నప్పటికి ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. ఈ విషయంలో పోలీస్ యంత్రాంగాన్ని తప్పుబట్టడం లేదని, రాజకీయ నాయకులను కచ్చితంగా తప్పుబడుతున్నానని అన్నారు. సుగాలీ ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలనే పోలీస్ అధికారులకు ఉంది కానీ, ఈ రాజకీయ బాస్ ల వల్ల వీళ్లు ముందుకు వెళ్లలేకపోతున్నారని ధ్వజమెత్తారు.

More Telugu News