అమరావతిని నాశనం చేయడం వల్ల ఎక్కువగా నష్టపోతోంది ఎస్సీలు, బీసీలే: చంద్రబాబు

12-02-2020 Wed 15:44
  • ఈ విషయం వైసీపీ ప్రభుత్వానికి అర్థం కావడంలేదు
  • ఎవరికేమైనా ఆయనకు పట్టదు.. తన కక్ష తీరడమే జగన్ కు ముఖ్యం
  • ఈ తీరులో ఒక సీఎం ఉండటం మంచిది కాదు
chandrababu says destruction of Amaravathi mostly effects on SC and BC

రాజధాని అమరావతి తరలింపు విషయమై వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోమారు మండిపడ్డారు. ఒక వర్గం పైనో, ఒక పార్టీ మీదనో, తన పైన కక్షతోనో అమరావతిని నాశనం చేయడం వల్ల ఎక్కువగా నష్టపోతోంది ఎస్సీలు, బీసీలే అన్న విషయం ఈ వైసీపీ ప్రభుత్వానికి అర్థం కావడం లేదని విమర్శించారు. ‘ఎవరికి ఏమైతేనేం, నా కక్ష తీరడమే నాకు ముఖ్యం’ అన్న రీతిలో ఒక ముఖ్యమంత్రి ఉండటం మంచిది కాదని ప్రజలు అంటున్నారంటూ ట్వీట్ చేశారు.