pan card: మీ వద్ద 2 పాన్‌ కార్డులు ఉన్నాయా?.. వెంటనే సరెండర్ చేసేయండి.. లేకపోతే రూ.10,000 ఫైన్ పడుద్ది మరి!

  • ఒక వ్యక్తి ఒకే పాన్ నంబర్‌ ఉండాలి
  • దీన్ని అతిక్రమిస్తే ఫైన్ వేయాల్సిందేనని అధికారుల నిర్ణయం
  • ఐటీ వెబ్‌సైట్‌లో అదనపు కార్డు రద్దు చేసుకునే అవకాశం
do you have two  pan Cards then You will be fined

మీ వద్ద ఒకటి కన్నా ఎక్కువ పాన్‌ కార్డులు ఉన్నాయా? అయితే, జాగ్రత్త పడాల్సిందే.. లేదంటే రూ.10,000 జరిమానా పడుద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒక వ్యక్తి ఒకే పాన్ నంబర్‌ను కలిగి ఉండాలని ఆదాయపు పన్ను చట్టం-1961 లోని సెక్షన్ 139 ఎ తెలుపుతోంది. దీన్ని అతిక్రమిస్తే ఫైన్ వేయాల్సిందేనని అధికారులు నిర్ణయించారు.

కొన్ని ప్రత్యేక కారణాల ద్వారా ఎక్కువ పాన్‌కార్డులను కలిగి ఉన్నవారు వెంటనే వాటిని అధికారులకు సమర్పించి, జరిమానా నుంచి తప్పించుకునే అవకాశాన్ని ఆదాయపుపన్ను శాఖ కల్పిస్తోంది. ఎన్‌ఆర్‌ఐలకు ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులుండే అవకాశం ఉంది. అలా ఒకటి కన్నా ఎక్కువ పాన్‌ కార్డులు ఉన్నవారు వెంటనే ఐటీ వెబ్‌సైట్‌కు వెళ్లి ‘సరెండర్ డూప్లికేట్ పాన్’ ఆప్షన్‌ క్లిక్ చేసి, అడిగిన వివరాలు పొందుపర్చి అదనంగా ఉన్న పాన్‌ కార్డులను రద్దు చేసుకోవచ్చు. 

More Telugu News