పవన్ కోసం పవర్ఫుల్ టైటిల్ .. 'విరూపాక్ష'

12-02-2020 Wed 12:23
  • చారిత్రక నేపథ్యంలో క్రిష్ సినిమా 
  • బందిపోటు పాత్రలో పవన్ కల్యాణ్ 
  • కథానాయిక విషయంలో రావాల్సిన స్పష్టత
Viroopaksha Movie

ప్రస్తుతం పవన్ కల్యాణ్ 'పింక్' రీమేక్ లో చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. ఆంగ్లేయులను దోచుకునే ఒక బందిపోటుగా ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు 'వీరు' అని చెబుతున్నారు.

ఈ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుంది కనుక, 'విరూపాక్ష' అనే టైటిల్ ను క్రిష్ పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కైరా అద్వానీని, ఆ తరువాత పూజా హెగ్డేని సంప్రదించగా, డేట్లు ఖాళీ లేవన్నారనే వార్తలు వినిపించాయి. పవన్ నుంచి రానున్న తొలి చారిత్రక చిత్రం కావడంతో, అభిమానులందరిలోను ఆసక్తి వుంది.