Amaravati: వ్యక్తిగత స్వార్థంతోనే జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదన: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

Prattipati Pulla Rao slams YS Jagan over three capitals
  • అధికారంలోకి రాగానే అమరావతి విచ్ఛిన్నానికి కుట్ర
  • మూడు రాజధానుల విధానం ఎక్కడా లేదు
  • రాజధాని కోసం రాజీలేని పోరాటం
తన వ్యక్తిగత స్వార్థం కోసం దేశంలో ఎక్కడాలేని మూడు రాజధానుల ప్రతిపాదనను ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తన స్వార్థంకోసం అధికారంలోకి రాగానే అమరావతి విచ్ఛిన్నానికి సీఎం పునాది వేశారని ధ్వజమెత్తారు. రైతుల ఆందోళనలను పట్టించుకోవడం లేదన్నారు. అయినా రాజధాని అమరావతిని కాపాడుకుంటామని, ఇందుకోసం రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Amaravati
Prathipati Pulla Rao
jagan
AP Capital

More Telugu News