Amaravati: సాయిని వేడుకునేందుకు షిర్డీ వెళ్లిన అమరావతి రైతులు

Amaracathi raitu JAC members tour to shirdee
  • రాజధానిని కొనసాగించేలా చూడాలని మొక్కుకుంటామని వెల్లడి
  • మొత్తం 170 మంది రైతుల ప్రయాణం
  • 57వ రోజుకు చేరిన ఆందోళన
‘సేవ్‌ అమరావతి... సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ నినాదంతో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తున్న రైతులు ఈరోజు ఉదయం షిర్డీసాయి దర్శనానికి వెళ్లారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మనసుమార్చి అమరావతిని రాజధానిగా కొనసాగించేలా చూడాలని స్వామిని వేడుకునేందుకు వెళ్తున్నట్లు రైతులు తెలిపారు. మొత్తం 170 మంది రైతులు షిర్డీ బయలుదేరారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చినప్పటి నుంచి రైతులు చేపట్టిన ఉద్యమం 57వ రోజుకి చేరింది. అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని రైతులు కోరుతున్నారు.
Amaravati
Raythi JAC
shirdi tour

More Telugu News