Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కోసం భారీ సెట్

  • ముంబైలో 'లైగర్' షూటింగ్ 
  • కథానాయికగా అనన్య పాండే 
  • హిందీ .. తమిళ భాషల్లోను రిలీజ్
Puri Jagannadh Movie

ఒక వైపున 'వరల్డ్ ఫేమస్ లవర్' విడుదలకి ముస్తాబవుతుంటే, మరో వైపున 'లైగర్' సెట్స్ పైకి వెళ్లడానికి విజయ్ దేవరకొండ సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా షూటింగు ముంబైలో జరగనుంది. 5 కోట్ల రూపాయల ఖర్చుతో అక్కడ భారీ సెట్ వేశారు. సాధారణంగా పూరి జగన్నాథ్ సెట్లు వేయించడు. కానీ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయిన కరణ్ జొహార్ వత్తిడి చేయడంపై అంగీకరించినట్టు తెలుస్తోంది.

ఎక్కువ భాగం షూటింగు ఈ సెట్ లోనే జరుగుతుందట. రేపటి నుంచి ఈ సినిమా షూటింగులో విజయ్ దేవరకొండ పాల్గొననున్నాడు. హీరోలకి మాస్ ఇమేజ్ తీసుకురావడంలోను .. రెట్టింపు చేయడంలోను పూరి సిద్ధహస్తుడు. ఈ సినిమాతో తన క్రేజ్ మరింత పెరుగుతుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడు. ఈ సినిమాతో తెలుగు తెరకి అనన్య పాండే కథానాయికగా పరిచయం కానుంది. తెలుగుతోపాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News