'అసురన్' దర్శకుడితో ఎన్టీఆర్

12-02-2020 Wed 11:26
  • తమిళంలో హిట్ కొట్టిన 'అసురన్'
  • ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్న వెట్రి మారన్ 
  • త్వరలో రానున్న స్పష్టత
Vetri Maaran Movie

క్రితం ఏడాది తమిళనాట విడుదలైన 'అసురన్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ధనుశ్ కథానాయకుడిగా నటించిన ఈ  సినిమా, ఆయన కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన వెట్రీమారన్ తో పనిచేయడానికి కోలీవుడ్ లోని స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. అయితే ఆయన ఎన్టీఆర్ తో కలిసి పనిచేయడానికి ఆసక్తిని చూపుతుండటం విశేషం.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ఆయన త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాతే వెట్రిమారన్ తో చేస్తాడని అంటున్నారు. ఈ సినిమాకి కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందని కొందరు అంటుంటే, ఎన్టీఆర్ తో కల్యాణ్ రామ్ ప్రాజెక్టు వేరే ఉందని మరి కొందరు చెబుతున్నారు. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం వుంది.