ఇస్కో, ఉస్కో అంటూ శివాలూగాడు.. గాల్లో కత్తులు తిప్పాడు: విజయసాయిరెడ్డి

12-02-2020 Wed 10:40
  • ప్రతిపక్ష నేతగా 9 నెలల్లో ఆయన చేసిందిదే
  • ‘ఇన్ సైడర్’ భూముల కోసం ప్రభుత్వాన్ని కూలుస్తానన్నాడు
  • అవినీతి అధికారులకు కాపలాదారయ్యాడు
  • పొర్లు దండాలతో బొంగరంలా తిరగడమే మిగిలింది 
vijaya sai reddy fires on chandra babu naidu

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేతగా ఆయన చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ లాభం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.

'ప్రతిపక్ష నేతగా 9 నెలల్లో చేసిందేమిటంటే... ఇసుక మాఫియాను రక్షించేందుకు ఇస్కో... ఉస్కో అంటూ శివాలూగాడు. ‘ఇన్ సైడర్’ భూముల కోసం ప్రభుత్వాన్ని కూలుస్తా, తేలుస్తా అని గాల్లో కత్తులు తిప్పాడు. అవినీతి అధికారులకు కాపలాదారయ్యాడు. పొర్లు దండాలతో బొంగరంలా తిరగడమే మిగిలింది' అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.