హైదరాబాద్ గెస్ట్ హౌస్ లో బిజీగా గడిపే కోణం ఏంటి అంబటి గారు?: బుద్ధా వెంకన్న

12-02-2020 Wed 09:58
  • ఐటీ దాడుల్లో ఎలుకను పట్టారో, ఏనుగును పట్టారో త్వరలోనే తెలుస్తుంది
  • వైసీపీ త్వరలోనే గాల్లో కలిసిపోవడం ఖాయం
  • అమరావతి కుంభకోణం అయినప్పుడు దాన్ని బయటపెట్టి, ప్రపంచానికి తెలియజేయాలి
Budda Venkanna comments on Ambati Rambabu

వైసీపీ ప్రభుత్వం, మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ఐటీ దాడుల్లో ఎలుకను పట్టారో, ఏనుగును పట్టారో త్వరలోనే తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే  మీరు ఎన్నో పట్టారని... ఈ 9 నెలల పాలనలో ఇంకెన్ని పట్టారో మీకే తెలియాలని ఎద్దేవా చేశారు.

లోకేశ్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావో లేక వైసీపీ నావని ముంచే ఎగసిపడే అలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. నిద్రలేస్తూనే సంజనా అంటూ లేచే మీ లాంటి గొప్ప నాయకులతో పార్టీని నడిపిస్తున్న జగన్ గారి వైసీపీ మాత్రం త్వరలోనే గాల్లో కలిసిపోవడం ఖాయమని చెప్పారు.

అమరావతి నిర్మాణం కుంభకోణం అయినప్పుడు ఆ కోణాన్ని బయటపెట్టి ప్రపంచానికి తెలియజేయాలని.... ఆ పని చేయకుండా, మీరు హైదరాబాద్ గెస్ట్ హౌస్ లో బిజీగా గడిపే కోణం ఏమిటి అంబటి గారూ? అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.