Andhra Pradesh: కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం!

  • జగన్ అధ్యక్షతన భేటీ కానున్న ఏపీ కేబినెట్
  • జగనన్న విద్యాకానుకపై చర్చించనున్న కేబినెట్
  • 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రతిపాదనలు చేసే అవకాశం
Andhra Pradesh Cabinet meeting in Amaravati

ఏపీ కేబినెట్ సమావేశం కాసేపట్లో ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన అమరావతిలో ఈ సమావేశం జరగబోతోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. జగనన్న విద్యాకానుక పథకం కింద ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మూడు జతల యూనిఫాం, రెండు జతల బూట్లు, పుస్తకాలను అందించే అంశంపై చర్చించనున్నారు.

 స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుపై చర్చ జరగనుంది. సీపీఎస్ ర్యాలీలపై నమోదైన కేసుల రద్దుపై కూడా చర్చించనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల విచారణకు తిరుపతిలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసే అంశంపై చర్చ జరగనుంది. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రతిపాదనలు చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను 27 రోజుల నుంచి 20 రోజులకు కుదించే ప్రతిపాదనపై కూడా చర్చ జరగనుంది.

More Telugu News