వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికి బెదిరింపులు

12-02-2020 Wed 09:45
  • కోర్టు ఆవరణలో చంపుతానని బెదిరించిన రౌడీ షీటర్
  • సుబేదారి పోలీసులకు నాయిని ఫిర్యాదు
  • తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన
Naini Rajender Reddy complained on Rowdi sheeter

ఓ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు తనను చంపుతానని బెదిరించాడంటూ వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనిశెట్టి మురళి హత్య కేసులో ప్రధాన నిందితుడైన బొమ్మతి విక్రమ్ తనను కోర్టు ఆవరణలోనే చంపుతానని బెదిరించాడని సుబేదారి పోలీసులకు రాజేందర్ ఫిర్యాదు చేశారు. విక్రమ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆ ఫిర్యాదులో ఆందోళన వ్యక్తం చేశారు. నాయిని ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విక్రమ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.