కుమార్తె అడిగిందని.. ఇష్టమైన వంటలను స్వయంగా చేసిపెట్టిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

12-02-2020 Wed 09:18
  • కుమార్తె కోసం సాధారణ గృహిణిగా మారిన స్మృతి ఇరానీ
  • పలు వంటకాలు చేసిపెట్టిన వైనం
  • ఇన్‌స్టాలో వాటి తయారీ విధానం పోస్ట్
Union Minister Smriti Irani turns as simple mother for her daughter

కేంద్రమంత్రిగా ఊపిరిసలపని పనులతో బిజీగా ఉండే స్మృతి ఇరానీ కుమార్తె కోసం సాధారణ గృహిణిగా మారిపోయారు. కుమార్తె అడిగిందని ఇష్టమైన వంటలు చేసిపెట్టారు. తనకు ఇష్టమైన వంటలు చేసి పెట్టమని కుమార్తె జోయిషి ఇరానీ అడగ్గానే గరిటె చేతపట్టిన మంత్రి పలు రకాల వంటలు చేసి కుమార్తెకు తినిపించారు. అంతేకాదు, ఆ వంటలు, వాటి వివరాలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. వెజ్ హక్కా నూడుల్స్, చికెన్ మంచూరియా వంటి పలు వంటకాలు చేసిన స్మృతి.. వాటి తయారీ విధానాన్ని కూడా స్పష్టంగా వివరించారు. ఇవి చూసిన వారు భేష్ అంటూ కొనియాడుతున్నారు.