ఢిల్లీలో ‘ఆప్’ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై అర్ధరాత్రి కాల్పులు

12-02-2020 Wed 06:32
  • ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన
  • ఓ కార్యకర్త మృతి, మరొకరికి గాయాలు
  • ఆప్ కుటుంబ సభ్యుల్లో ఒకరిని కోల్పోయామంటూ పార్టీ ట్వీట్
  Shots fired at AAP MLA Naresh Yadav convoy in Delhi

నిన్న వెల్లడైన ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేపై అర్ధరాత్రి వేళ జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. మెహ్‌రౌలీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన నరేశ్ యాదవ్ దేవుని దర్శనం కోసం ఆలయానికి వెళ్లారు. అనంతరం కాన్వాయ్‌లో ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అశోక్ మన్ అనే కార్యకర్త చనిపోగా, మరొకరు గాయపడ్డారు. ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సందర్భంగా, ‘ఆప్’ కుటుంబ సభ్యులలో ఒకరిని కోల్పోయామని ఆ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.