శాసనమండలి రద్దుపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయం

11-02-2020 Tue 21:45
  • త్వరలో టీడీపీ ఢిల్లీ పర్యటన
  • ఇతర అంశాలపైనా కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి తేదీ ఖరారు
TDP set to complain Union Government over legislative council abolition

టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. త్వరలో ఢిల్లీలో పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే పర్యటన తేదీని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించిన పిదప ప్రకటించనున్నారు. శాసనమండలి రద్దు, ఇతర అంశాలపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే, కేసులు, దాడులతో భయకంపితులను చేస్తున్నారని చంద్రబాబుకు తెలిపారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ బాధితులకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.