Uddav Thakaray: ప్రధాని మన్ కీ బాత్ వదిలి.. జన్ కీ బాత్ వినాలి: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే

  • బీజేపీని సామాన్యుడి చీపురు తుడిచిపెట్టింది
  • కేజ్రీవాల్ ను ఉగ్రవాదన్నారు... కానీ ఓడించలేకపోయారు
  • ఆప్ పనులను చూసే ప్రజలు మళ్లీ గెలిపించారన్న ఆదిత్య థాకరే
Who listen Man ki Bath listen Jan ki Bath

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించడంతో..  శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే స్పందిస్తూ.. ఈ ఎన్నికలు బీజేపీకి చెంపపెట్టన్నారు. ప్రధాని మోదీ తరచూ ‘మన్ కీ బాత్’ పేర కార్యక్రమాన్ని చేపడుతుంటారని ఇప్పుడు ఆయన ఆ కార్యక్రమాన్ని వదిలి ‘జన్ కీ బాత్’( ప్రజల మాటలు) వినాల్సిన అవసరమేర్పడిందని వ్యాఖ్యానించారు.

ఆప్ పార్టీ అధినేత సీఎం కేజ్రీవాల్ ను ఉద్ధవ్ అభినందించారు. పాతకాలపు నాటి సంప్రదాయాలను కొనసాగిస్తోన్న బీజేపీని, ఓ సామాన్యుడి చీపురు కట్ట తుడిచిపెట్టిందన్నారు. ఎన్నికల ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్ ను ఉగ్రవాదంటూ బీజేపీ నేతలు విమర్శించారని, అయితే, ఆయన్ను ఓడించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఉద్ధవ్  థాకరే కుమారుడు ఆదిత్య థాకరే ఆప్ విజయంపై వ్యాఖ్యానిస్తూ.. ఈ విజయం ఆ పార్టీ ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపని పేర్కొన్నారు.

More Telugu News