Vinod Kumar: వాస్తవాలు గ్రహించి విపక్షాలు నోరుమూసుకోవాలి: వినోద్ కుమార్

TRS leader Vinod Kumar fumes over opposition parties
  • ప్రతిపక్షాలపై ధ్వజమెత్తిన టీఆర్ఎస్ నేత
  • గోబెల్స్ ప్రచారం మానుకోవాలని హితవు
  • ఇప్పటికైనా కళ్లు తెరవాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సూచన
టీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ విపక్షాలపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దుష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. గోబెల్స్ ప్రచారం కట్టిపెట్టాలని సూచించారు. గత ఆరేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది రూ.లక్షన్నర కోట్లేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఏమీలేదని వెల్లడించారు. ఈ వాస్తవాలు గ్రహించి విపక్షాలు నోరుమూసుకోవాలని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని పేర్కొన్నారు.
Vinod Kumar
TRS
BJP
Congress
Telangana

More Telugu News