AAP: ఢిల్లీలో ‘ఆప్’ సంపూర్ణ విజయం.. మూడోసారి అధికారంలోకి!

  • మొత్తం 70 సీట్లలో 62 స్థానాల్లో ఆప్ విజయం
  • 8 స్థానాలు దక్కించుకున్న బీజేపీ
  • కాంగ్రెస్ కు ఘోర పరాజయం 
 AAP tremendous victory in Delhi

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంపూర్ణ విజయం సాధించింది. మొత్తం 70 సీట్లకు గాను 62 స్థానాల్లో ఆప్ విజయం సాధించగా, బీజేపీ 8 నియోజవర్గాల్లో మాత్రమే గెలుపొందింది. ‘ఆప్’ గెలుపుతో వరుసగా మూడో సారి కేజ్రీవాల్ సీఎం పీఠం దక్కించుకున్నట్టయింది. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. గతంలో షీలా దీక్షిత్ నేతృత్వంలో వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు. దీంతో, వరుసగా రెండోసారి ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.  

కాగా, ఈ నెల 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈరోజుతో ఢిల్లీ అసెంబ్లీ పదవీకాలం ముగియడంతో శాసనసభను లెఫ్టినెంట్ గవర్నర్ రద్దు చేశారు. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ‘ఆప్’ ను మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించనున్నారు. ఈ నెల 14న ఢిల్లీ సీఎం గా కేజ్రీవాల్ మరోమారు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News