shaheen bagh protests: జనం గట్టిగా షాకిచ్చారు.. అమిత్ షాపై ఆప్ లీడర్ అమానతుల్లాఖాన్ సెటైర్

  • షహీన్ బాగ్  ఆందోళనలను అమిత్ షా తప్పుపట్టడంపై కౌంటర్
  • షహీన్ బాగ్, జామియా వర్సిటీ ఉన్న నియోజకవర్గంలో భారీ గెలుపు దిశగా ఆప్
  • బీజేపీ విద్వేషపూరిత ప్రచారాన్ని జనం తిప్పికొట్టారంటున్న లీడర్లు

ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ల ప్రచారం సందర్భంగా అమిత్ షా చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ ఆప్ లీడింగ్ క్యాండిడేట్ అమానతుల్లాఖాన్ గట్టిగా సెటైర్ వేశారు. ‘‘జనం గట్టిగా కరెంటు షాక్ ఇచ్చారు. 13వ రౌండ్ కౌంటింగ్ అయ్యేసరికే ఓక్లా సెగ్మెంట్లో 72 వేలకుపైగా మెజారిటీ వచ్చింది’’ అని పేర్కొన్నారు. బీజేపీ లీడర్లు చేసిన విద్వేషపూరిత ప్రసంగాలు, సీఏఏ ఆందోళనకారుల పట్ల చేసిన కామెంట్లకు ఇది సరిగ్గా బదులిచ్చే సమయమని చెప్పారు.

అమిత్ షా ఏమన్నారు? 

ఓక్లా అసెంబ్లీ సెగ్మెంట్లో ఎలక్షన్ ప్రచారం చేసిన సమయంలో అమిత్ షా ఆందోళనలను ఉద్దేశించి పలు కామెంట్లు చేశారు. ‘‘మీరు ఓటు వేసినప్పుడు ఈవీఎం బటన్ ను ఎలా నొక్కాలంటే.. ఆ కోపం, ఆ కరెంటు షహీన్ బాగ్ లో షాకివ్వాలి..’’ అని ఓటర్లను కోరారు. అయితే ఈ సెగ్మెంట్లో ఆప్ క్యాండిడేట్ అమానతుల్లాఖాన్ భారీ మెజారిటీతో ముందున్నారు. దీంతో అమిత్ షా కామెంట్లను ప్రస్తావిస్తూ.. జనం గట్టిగా షాకిచ్చారని సెటైర్ వేశారు.

ఆందోళనలన్నీ అక్కడే.. 

ఢిల్లీలో రెండు నెలలుగా యాంటీ సీఏఏ ఆందోళనలు జరుగుతున్న షహీన్ బాగ్ ప్రాంతం, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ తదితర ప్రాంతాలన్నీ ఓక్లా అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోనే ఉంటాయి. బీజేపీ లీడర్లంతా ఆ ఆందోళనలను ప్రస్తావిస్తూనే ప్రచారం చేశారు.

More Telugu News