పుట్టపర్తిలో ధోనీ.. చూసేందుకు ఎగబడిన అభిమానులు

11-02-2020 Tue 15:29
  • సత్యసాయి సమాధిని దర్శించుకున్న ధోనీ
  • ధ్యాన మందిరంలో 20 నిమిషాల పాటు ధ్యానం
  • ధోనీకి సేవా కార్యక్రమాల గురించి వివరించిన రత్నాకర్
MS Dhoni visits Puttaparthi

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం పుట్టపర్తిలో సత్య సాయిబాబా మహాసమాధిని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దర్శించుకున్నాడు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి ధోనీ వచ్చాడు. విమనాశ్రయం నుంచి ప్రశాంతి నిలయానికి చేరుకున్న ధోనీకి ట్రస్టు సభ్యులు రత్నాకర్ ఘన స్వాగతం పలికారు. అనంతంర సాయి కుల్వంత్ సభామందిరంలో ఉన్న సత్యసాయి మహాసమాధి వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి దర్శించుకున్నారు. ఆ తర్వాత బాబా ధ్యాన మందిరంలో 20 నిమిషాల పాటు ధ్యానం చేశారు.

తన పర్యటనలో భాగంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా ధోనీ సందర్శించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సేవా కార్యక్రమాల గురించి ధోనీకి రత్నాకర్ వివరించారు. అనంతరం ధోనీ మాట్లాడుతూ, బాబా సేవలు అద్భుతమని చెప్పారు. సత్యసాయి ప్రపంచానికే ఆదర్శమని, ట్రస్టు సేవలను మరింత విస్తృతం చేయాలని కోరారు. మరోవైపు, ధోనీ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు.