'లూసిఫర్' రీమేక్ లో మెగాస్టార్

11-02-2020 Tue 15:16
  • మలయాళంలో హిట్ కొట్టిన 'లూసిఫర్'
  • తెలుగు రీమేక్ కి సన్నాహాలు 
  • స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన సుకుమార్
Chiranjivi in Lucifer Movie Remake

మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన 'లూసిఫర్'.. క్రితం ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వివేక్ ఒబెరాయ్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తెలుగు రీమేక్ లో చిరంజీవి నటించనున్నట్టు తెలుస్తోంది. తిరుపతి ప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా వుండనుందని అంటున్నారు.

తెలుగు రీమేక్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను సుకుమార్ పూర్తి చేశాడు. అయితే ఈ సినిమా ఆయన దర్శకత్వంలో ఉంటుందా? లేదంటే మరో దర్శకుడికి పగ్గాలు ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సుకుమార్ .. బన్నీ సినిమాలో బిజీగా వున్నాడు కనుక, వేరే దర్శకుడికి 'లూసిఫర్' రీమేక్ బాధ్యతలను అప్పగించవచ్చని చెప్పుకుంటున్నారు. దర్శకుడు ఎవరైనా ఈ ఏడాదిలోనే ఈ రీమేక్ సెట్స్ పైకి వెళ్లడమనేది ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కొరటాల సినిమాతో చిరంజీవి బిజీగా వున్న సంగతి తెలిసిందే.