కేజ్రీవాల్ ను అభినందించిన మమతా బెనర్జీ, చంద్రబాబు

11-02-2020 Tue 15:13
  • కేజ్రీవాల్ కు రాజకీయ ప్రముఖుల ఫోన్ కాల్స్
  • మరోమారు సీఎం కానున్న కేజ్రీకి అభినందనల వెల్లువ
  • కేరళ సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తదితరుల విషెస్
 Mamatha Benarji and Chandrababu congratulate kejriwal

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్ కు పలువురు రాజకీయ ప్రముఖులు ఫోన్ కాల్స్, పోస్ట్స్ ద్వారా అభినందనలు తలిపారు. కేజ్రీవాల్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఢిల్లీలో బీజేపీని, సీఏఏ, ఎన్ ఆర్సీ, ఎన్పీఆర్ లను ప్రజలు తిరస్కరించారని, కేవలం అభివృద్ధి మాత్రమే విజయం తెచ్చిపెడుతుందని, ప్రజాస్వామ్యం గెలిచిందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ కు అభినందనలు తెలియజేశారు.

కేరళ సీఎం పినరయి విజయన్ స్పందిస్తూ ఆప్ కు, కేజ్రీవాల్ కు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ‘ఆప్’ విజయం దేశంలోని ప్రజా అనుకూల ప్రభుత్వాలకు కొత్త ఒరవడి సృష్టించాలని ఆకాంక్షించారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఎంపీ కనిమొళి కూడా కేజ్రీవాల్ కు అభినందనలు తెలిపారు. విద్వేష రాజకీయాలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, మతతత్వ రాజకీయాలను అభివృద్ధి తొక్కిపెడుతుందని చెప్పడానికి ఆప్ విజయమే నిదర్శనమని అన్నారు.