Galla Jayadev: ఏపీ మరోసారి చిన్నచూపుకు గురైంది: గల్లా జయదేవ్

Galla Jaydev accuses Center over Budget allocations
  • ఆర్థికమంత్రి ఏపీ కోసం ఎలాంటి ప్రస్తావనలు తీసుకురాలేదన్న గల్లా
  • ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పట్టించుకోలేదని ఆరోపణ
  • బడ్జెట్ చర్చలో ఈ అంశాన్ని ఎత్తిచూపినా ఫలితం లేకపోయిందని ఆవేదన
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ మలివిడత ప్రసంగంలోనూ ఏపీ కోసం ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం బాధాకరమని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం దక్కాల్సిన ప్రయోజనాల దిశగా బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు జరపలేదని ఆరోపించారు. కనీసం ప్రస్తావనలు కూడా తీసుకురాలేదని వాపోయారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా అనేకమంది ఈ అంశాన్ని ఎత్తిచూపినా, ఏపీ మరోసారి చిన్నచూపుకు గురైందని వ్యాఖ్యానించారు.
Galla Jayadev
Andhra Pradesh
Union Budget 2020
Nirmala Sitharaman

More Telugu News