ఆ సినిమాలు .. హిట్లు నాకు రాసిపెట్టి లేవంతే: హీరో వరుణ్ సందేశ్

11-02-2020 Tue 14:18
  • కొన్ని సినిమాలు చేజారిపోయాయి 
  • ఆ సినిమాలు విజయాలను అందుకున్నాయి 
  • తనకి నచ్చిన సినిమా గురించి చెప్పిన వితిక  
Varun Sandesh about his missed movies

వరుణ్ సందేశ్ ను కెరియర్ తొలినాళ్లలో విజయాలు పలకరించాయి. ఆ తరువాతనే ముఖం చాటేశాయి. ఆ విషయాన్ని గురించే తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ప్రస్తావించాడు. "నేను చేయవలసిన సినిమాలు కొన్ని చేజారిపోయాయి. అలాంటి సినిమాల జాబితాలో '100%లవ్'.. 'గుండెజారి గల్లంతయ్యిందే'తో పాటు మరో రెండు మూడు సినిమాలు కనిపిస్తాయి. ఆ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి.

 ఆ సినిమాలు .. హిట్లు నాకు రాసిపెట్టిలేవనుకున్నాను .. అంతే" అని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత వితిక మాట్లాడుతూ .."వరుణ్ సందేశ్ చేసిన సినిమాల్లో 'హ్యాపీడేస్'.. 'కొత్త బంగారులోకం' సినిమాలు అందరికీ తెలిసినవే. కానీ 'ప్రియతమా నీవచట కుశలమా' అనే ఒక సినిమాను ఆయన చేశాడు. ఆ సినిమాలో ఆయన చాలా గొప్పగా చేశాడు. ఆయన సినిమాల్లో నాకు బాగా నచ్చింది అదే" అని చెప్పుకొచ్చింది.